తమ మద్దతు ఎవరికో తేల్చి చెప్పిన ఎంఐఎం..అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..!!

ఇతర రాష్ట్రాలలో హిందూ ముస్లిం గొడవలు జరిగి కాలిపోతుంటే.. తెలంగాణలో మాత్రం సంక్షేమ ప్రభుత్వం నడుస్తుంది. దేశం తెలంగాణను చూసి నేర్చుకోవాలి.. హిందూ, ముస్లిం గొడవలు జరగుండకుండా తెలంగాణ బాటలో నడవాలి – ఓవైసీ..

అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారని అన్నారు. మరో వైపు మేము ఎవరికి బీ టీమ్ కాదని, బీ టీమ్ అని పిలిచే పార్టీపై మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో హిందూ ముస్లిం గొడవలు జరిగి కాలిపోతుంటే.. తెలంగాణలో మాత్రం సంక్షేమ ప్రభుత్వం నడుస్తుందన్నారు. దేశం తెలంగాణను చూసి నేర్చుకోవాలని, హిందూ, ముస్లిం ఇతర వర్గాలు గొడవలు జరగకుండా తెలంగాణ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. జైపూర్‌ రైలు ఘటనలో చనిపోయిన హైదరాబాద్‌ యువకుడికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్య దేశానికి గొప్ప సందేశం పంపిందని చెప్పారు..