ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ కారుపై కాల్పులు..

R9TELUGUNEWS.COM ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రయాణంలో ఉన్న ఓవైసీ కాన్వాయ్‌పై ఛిజారసీ టోల్ గేట్ సమీపంలో కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్వయంగా ఓవైసీనే వెల్లడించారు. తన కారు పంక్చర్ అయిందని, తాను వేరే కారులో వెళ్లానని తెలిపారు. అయితే దాడికి పాల్పడ్డ వారు ఎవరనేది తెలియలేదు. ఓవైసీ సైతం ఎవరిపై అనుమానాలు ఉన్నట్లు వెల్లడించలేదు…కొద్ది సమయం క్రితం ఛిజారసీ టోల్ గేట్ వద్ద నేను ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిగాయి. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ముగ్గురు, నలుగురు వ్యక్తులు ఉన్నారు. కాల్పులు జరిపిన అనంతరమే అక్కడి నుంచి పారిపోయారు. నా కారు పంక్చర్ అయింది. అనంతరం నేను వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాను. మేమంతా క్షేమంగా ఉన్నాం’’ అని ఓవైసీ ట్వీట్ చేశారు._