చంద్రుడు జైల్లో హ్యాపీగా ఉన్నారు – ఒవైసీ..
చంద్రబాబు అరెస్టుపై స్పందించిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. జైల్లో చంద్రుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీటీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంశంపై మజ్లిస్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని జైల్లో చంద్రుడు చాలా హ్యాపీగా ఉన్నారని, ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రెండే పార్టీలు ఉన్నాయని, ఒకటి టీడీపీ అయితే రెండోది జగన్ పార్టీ వైసీపీ అని చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాత్రం ఎప్పటికీ నమ్మలేమని, ప్రజలు కూడా ఆయన్ని ఎప్పుడూ నమ్మొద్దంటూ మజ్లీస్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కోరారు. అక్కడ ఎన్నికల్లో పోటీ విషయంపైనా అసదుద్దీన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మజ్లిస్ కార్యకర్తలతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాలన పర్వాలేదు.. కానీ చంద్రబాబును నమ్మలేం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు..