హీరో నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. శనివారం తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బింబిసార చిత్రాన్ని ఆగస్ట్ 5న విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి….బింబిసారలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కీలకంగా ఉండబోతున్నాయి. భారీ సెట్స్‌తో కళ్యాణ్ రామ్ (Kalyan ram) కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నికల్ వేల్యూస్ మూవీ ఇది. ఆగస్ట్ 5న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ తెలియజేసింది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు….
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.