తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు..!బొత్స సత్యనారాయణకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్….
తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు..
విజయవాడ.. తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడారు.”ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు..
అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి” అని బొత్స వ్యాఖ్యానించారు.
ఆ వ్యవస్థ ఎలా పుట్టిందో పవన్ తెలుసుకోవాలి
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. అతని వ్యాఖ్యలపై ఎవరూ పట్టించుకోకుంటేనే మంచిదన్నారు. పొద్దు పొద్దున్నే మాకెందుకీ రచ్చ?అంటూ అసహనం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందో ముందు పవన్ తెలుసుకోవాలని బొత్స హితవుపలికారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థపై దుర్బుద్ధితో విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు…
బొత్స సత్యనారాయణకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్
పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో కూడా ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఏ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బొత్స బాధ్యతాయుతమైన వ్యక్తిగా మాట్లాడలేదన్నారు…
పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో కూడా ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఏ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బొత్స బాధ్యతాయుతమైన వ్యక్తిగా మాట్లాడలేదన్నారు.