హుజుర్నగర్ నియోజకవర్గం,పాలకీడమండలం,జానపహాడ్ ఎత్తిపోతల పధకం.. పరిశీలించారు మంత్రి ఉత్తమ్.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోదావరి నదిపై దేవాదుల సీతారామ సీతమ్మధార సమ్మక్క సారక్క గౌరవెల్లి తుమ్మిడి హాట్టి వంటి ప్రాజెక్టు కట్టి ఉంటే బనకచర్ల వివాదం ఉండేది కాదని గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయని ఏపీ రాష్ట్రంలో బనకచర్ల ప్రాజెక్టు తెరమీద ఏపీ ప్రభుత్వం తెచ్చిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామ సమీపంలోని కృష్ణా నదిపై 302 కోట్లతో నిర్మాణం జరుగుతున్న జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడి హేట్టి వద్ద డిజైన్ చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేస్తే 38వేలకోట్లతో పూర్తయి 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని మిగిలిన 62 వేల కోట్లతో కృష్ణ గోదావరి నదులపై ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. కాలేశ్వరం పేరుతో గత ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. కాలేశ్వరం రైతుల ప్రయోజనం కోసం కాదని వారి వ్యక్తిగత ప్రయోగం కమీషన్ల కోసమే నిర్మించారని మండిపడ్డారు.కాళేశ్వరం డిజైన్ చేసింది వాళ్లే ..కట్టింది వాళ్లే కూలింది కూడా ఆ ప్రభుత్వంలోనే అన్నారు…..
*కృష్ణా,గోదావరి జలాశయాలలో తెలంగాణా వాటా కోసం పోరాటం*
#బి.ఆర్.ఎస్ పాలకుల పాపానికి 16 వేల కోట్ల వడ్డీ భారం
#ఇది రైతాంగ పక్షపాత ప్రభుత్వం
# ఎత్తిపోతలపథకాలతో హుజుర్నగర్, కోదాడ లు సస్యశ్యామలం
#2,265.24 కోట్లతో కోట్లతో 86,801 ఎకరాల కొత్త ఆయాకట్టుకు సాగు నీరు
*-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*
కృష్ణా,గోదావరి జలాశయాలలో తెలంగాణాకు న్యాయబద్ధంగా రావలసిన నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేకుండా పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
సంప్రదింపులతో కేటాయింపులు జరగకుంటే న్యాయపరంగా పోరాడి న్యాయమైన వాటా సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇది రైతుపక్ష పాత ప్రభుత్వమని,వారి ఉన్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని ఆయన చెప్పారు
కృష్ణా జలాశయాలలో 811 టి.యం.సి లకు గాను ఆంద్రప్రదేశ్ కు 599 టి.యం.సి లనీటిని ధారా దత్తం చేసిన ఘనత బి.ఆర్.ఎస్ పాలకులదని ఆయన మండిపడ్డారు.
తెలంగాణా కు 299 టి.యం.సి లు ఆంద్రప్రదేశ్ కు 599 టి.యం.సి లంటూ వ్రాత పూర్వకంగా రాసిచ్చిన చరిత్ర బి.ఆర్.ఎస్ ప్రాణుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు
పదేళ్ళ బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన పాపానికి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 16 వేల రూపాయల వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని ఆయన చెప్పారు.
శుక్రవారం ఉదయం హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకీడు మండలం జానపహాడ్,బెట్టే తండా ఎత్తిపోతల పధకాలను ఆయన పరిశీలించారు.
నీటిపారుదల రంగాన్ని అప్పటి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆయన విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే తడవుగా కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఆయకట్టు,జనాభా ఆధారంగా నీటి కేటాయింపుల కోసం పోరాడుతున్నామన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 38 వేల కోట్ల అంచనా వ్యయంతో తుమ్మడిహట్టి వద్ద డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ చేవెళ్ల-ప్రాణహిత పేరుతో ప్రాజెక్టును నిర్మిస్తే కమిషన్ల కక్కుర్తితో లక్ష కోట్లు వెచ్చించి బి.ఆర్.ఎస్ పాలకులు లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కుప్ప కూలి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును అదే తుమ్మడిహట్టి వద్ద నిర్మిస్తే 62 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలి ఉండేవని ఆయన తెలిపారు
అవే డబ్బులతో ఎస్.ఎల్.బి.సి,పాలమూరు రంగారెడ్డి, భీమా,నెట్టెంపాడు, కోయిలసాగర్,దేవాదుల,సీతారామ,గౌరెల్లి వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణా ప్రాంతాన్ని సస్యశ్యామలం అయ్యేదని ఆయన అన్నారు
వీటన్నింటినీ తోసి రాజని బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన తప్పిదాలతో నేడు రాష్ట్ర ప్రభుత్వంపై సంవత్సరానికి 16 వేల కోట్ల రూపాయలు వడ్డీ భారం పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
పైగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,500 కోట్లు,సీతారామ ప్రాజెక్టు మీద 10 వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా ఒక్క ఎకరా కొత్త ఆయకట్టును సేద్యంలోకి తీసుకు రాలేక పోయారని ఆయన విమర్శించారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నీటిపారుదల శాఖామంత్రిగా తాను గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటు రావడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినా ఖరీఫ్ ,రబీ సీజన్ లను కలిపి రికార్డు స్థాయిలో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామన్నారు.
ఇది యావత్ భారత దేశంలోనే ఆల్ టైం రికార్డ్ గా ఆయన అభివర్ణించారు.
రైతుభరోసా పథకంతో రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.తొమ్మిది రోజుల వ్యవధిలో 9 వేల కోట్లను రైతుల ఖాతాలలో జమ చేశామని ఆయన వెల్లడించారు.
*కాంట్రాక్టర్ పై గరం…గరం*
జవహర్ జానపహాడ్ ఎత్తిపోతల పధకం పనులు వేగవంతంగా జరగడం లేదంటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిన ఏజెన్సీ నిర్వహకుల పై మండి పడ్డారు.
స్వయంగా తాను మూడు సార్లు స్వయంగా తనిఖీలు నిర్వహించినా పనులు ముందుకు సాగడం లేదంటూ ఆయన తీవ్రంగా మందలించారు.డిజైన్ లో మార్పులు అవసరం అయితే సి.డి.ఓ (సర్క్యూలర్ డీజైన్ ఆపరేషన్ ) ద్వారా చేసుకోవచ్చని ఆయన సూచించారు.