బంగారం ధరతో పోటీ పడుతున్నా ,దేశి రకం మిర్చికి ధర..

ఘాటెక్కిన ఎర్ర బంగారం.. రికార్డ్ స్థాయికి చేరిన దేశీ రకం మిర్చి ధర..
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశి రకం మిర్చికి ఈరోజు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ ధర రూ. 45,000. కొద్ది రోజుల క్రితం ఇదే మార్కెట్లో దేశి రకం మిర్చికి ధర రూ.44,000 పలికింది. ఈరోజు దీని ధర రూ. 45 వేలకు చేరింది…భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన రైతు లింగేశ్వరరావు 24 బస్తాల దేశి రకం మిర్చితో మార్కెట్‌కు తెచ్చాడు. లోకేశ్వర కంపెనీ ఖరీదుదారులు దీనికి రూ. 45,000 నిర్ణయించారు. దేశి రకం మిర్చికి క్వింటాల్ ధర రూ. 45,000 పలకడం ఇదే తొలిసారి…