దేశి మిర్చి ధర రూ. 90 వేలు…!

వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో.. మార్కెట్ చరిత్రలోనే రికార్డు ధరను దేశీ రకం మిర్చి నమోదు చేసింది. క్వింటాల్ దేశీ రకం మిర్చి ధర 90 వేల రూపాయలు అయింది. పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ కు క్వింటాల్ కు 90 వేల రూపాయలు ధర పలికింది. ఒక్కసారి మిర్చి ధర అమాంతం పెరిగిపోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.