మిర్యాలగూడ BRS ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్ రావు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ రైడ్స్….

హైదరాబాద్ :
*ఐటీ రైడ్స్*

మిర్యాలగూడ BRS ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్ రావు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ రైడ్స్..

40 బృందాలతో హైదరాబాద్ లో పలు కార్యాలయాలు, తెలంగాణ వ్యాప్తంగా దాడులు…

దేశ వ్యాప్తంగా పవర్ ప్లాంట్స్ బిజినెస్ లు…

ఎన్నికల కోసం భారీ గా డబ్బులు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు…!

బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల పై ఐటీ దాడులు..

*బి ఆర్ ఎస్ అభ్యర్థి బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు*

కోకిల డిజిటల్ మీడియా
హైదరాబాద్:ప్రతినిధి

హైదరాబాద్:ప్రతినిధి
ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లో వ‌రుస‌గా ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల పొంగులేటి శ్రీ‌నివాస్‌, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి బంధులు, రాజ‌గోపాల్‌రెడ్డి బంధువుల ఇండ్ల‌లో సోదాలు నిర్వ‌హించిన ఐటీ అధికారులు ఇవాళ న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో ఐటీ త‌నిఖీలు నిర్వ‌హించారు.

బీఆర్ఎస్ అభ్య‌ర్థి భాస్క‌ర్‌రావు బంధువులు, అనుచ‌రుల ఇళ్ల‌లో త‌నీఖీలు నిర్వ‌హిస్తున్నారు.ఏక కాలంలో 40 బృందాలతో ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

మిర్యాలగూడతో పాటు నల్గొండ, హైదారాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నల్లమోతు భాస్కర్ రావు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

మిర్యాలగూడ BRS ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్ రావు కుమారులు, అనుచరుల ఇంట్లో కొనసాగుతున్న ఐటీ రైడ్స్.

40 బృందాలతో హైదరాబాద్లో పలు కార్యాలయాలు, తెలంగాణ వ్యాప్తంగా దాడులు.

ఇటీవలే మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల మీద ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే…