నల్గొండ: మిర్యాలగూడ బైపాస్ వద్ద ప్రమాదం, ముగ్గురు మృతి.
సిమెంట్ ట్యాంకర్ ను ఢీకొన్న డీసీఎం వాహనం.
మలుపు తిరుగుతున్న సమయంలో ట్యాంకర్ ను ఢీకొన్న డీసీఎం వాహనం.
డీసీఎం వాహనంలో ఉన్న ముగ్గురు కూలీలు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.
క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలింపు..
*మిర్యాలగూడ ఈదులగూడలో ప్రమాదం: డీసీఎం వ్యాన్ సిమెంట్ ట్యాంకర్తో ఢీకొని ముగ్గురు మరణం!*
నల్గొండ జిల్లా
మిర్యాలగూడ మండలం ఈదులగూడ చౌరస్తా దగ్గర గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంతో ముగ్గురు కూలీలు మరణించారు.
హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ సిమెంట్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టైల్స్ కూలీలపై పడి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
*మరో ముగ్గురు ఆస్పత్రిలో*
ప్రమాదంతో తీవ్ర గాయాలతో మరో ముగ్గురు కూలీలను మిర్యాలగూడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల పేర్లు ఇంకా తెలియలేదు.
*పోలీసుల చర్యలు*
వన్ టౌన్ పోలీసులు స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. డీసీఎం డ్రైవర్ వేగంగా వెళ్తూ ప్రమాదానికి కారణమయ్యాడని అనుమానం. కేసు నమోదైంది.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959