మిషన్ భగీరథ పథకంతో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతం మటుమాయం..మంత్రి జగదీష్ రెడ్డి..

మంత్రి జగదీష్ రెడ్డి , సుడిగాలి పర్యటన…..

నల్లగొండ జిల్లా..
మునుగోడు.
…………………
మునుగోడు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు మంత్రి జగదీష్ రెడ్డి……
మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో నేరుగా లబ్ది దారుల ఇంటికే వెళ్ళి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ చెక్కుల్ని మాజి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి..అనంతరం కిష్ణాపురం వేణుగోపాల స్వామి ఆలయ పాలక వర్గ ప్రమాణ స్వీకార మహొత్సవంలో మంత్రి పాల్గొన్నారు..అక్కడి నుంచి చండూర్ మండల కేంద్రానికి చేరుకోని కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ చెక్కుల్ని వారి ఇళ్ళ వద్దకే వెళ్ళి అందజేశారు..అనంతరం కొటమైసమ్మ తల్లి మూడవ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు….
ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎంతో ముందుచూపుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో మునుగోడు నియోజికవర్గంలో ఫ్లోరైడ్ భూతం మటుమాయం అయిందని అన్నారు…ఇంజనేరింగ్ అద్భుతం,ముఖ్యమంత్రి కెసీఆర్ ఎంతో దార్శనికతతో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణాలో కరవు అన్నదే రాదని, సస్యశ్యామల తెలంగాణా కోసం కలలు కని ,వాటిని సాకారం చేస్తున్న మహానుభావుడు ముఖ్యమంత్రి కెసీఆర్ అని అన్నారు..తెలంగాణాలో చేస్తున్న సుభిక్షమైన పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ,అందుకు ముఖ్యమంత్రి కెసీఆర్ అవసరం దేశానికి ఉందని అన్నారు….తెలంగాణా రాష్ట్రంలో అభివ్రుద్ది సంక్షేమం జోడేధ్దుల్లా ముందుకు పోతున్నాయని అన్నారు…. కరోనా లాంటి విపత్తు వచ్చినా ఎలాంటి అటంకాలు లేకుండా అభివ్రుద్ది సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసీఆర్ దని అన్నారు… ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ముఖ్యమంత్రి కెసీఆర్ వచ్చిన తర్వాతే ప్రజల్లో ఆత్మవిశ్వాసం, భరసా పెరిగిందని తెల్పారు… సమైఖ్య పాలనలో మునుగోడు ప్రాంతం ఫ్లోరైడ్ తో, కరువు కాటకాలతో అల్లాడిపోయిందని నేడు మునుగోడు ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు..ఈ కార్యక్రమంలో మునుగోడు మాజి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జెడ్పీటీసీ స్వరూప రవి, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి. స్దానిక ప్రజా ప్రతినిధలు తదితరులు పాల్గొన్నారు..