2018లో మిస్ తెలంగాణకు ఎంపికైన యువతీ ఆన్‎లైన్‎లో ఆత్మహత్యాయత్నం..!

హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది..
R9TELUGUNEWS.com
అది గమనించిన ఆమె స్నేహితురాలు వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించింది. కాల్ వచ్చిన వెంటనే నారాయణగూడ పోలీసులు స్పందించారు…సమయానికి స్పందించిన పోలీసులు యువతిని కాపాడారు. వివరాలలోకి వెళ్తే.. హాసిని అనే యువతి నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్‎నగర్ రోడ్ నెంబర్ 6లో ఓ అపార్ట్‎మెంట్‎లోని ఫ్లాట్‎లో ఉంటోంది. హాసిని 2018లో మిస్ తెలంగాణకు ఎంపికైంది. కాగా.. హాసిని ఈ రోజు ఉదయం ఆత్మహత్య యత్నం చేసింది. పైగా తన సూసైడ్‎ను ఆన్‎లైన్‎లో పెట్టింది. గమనించిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన యువతి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆమెను ప్రాణాలతో కాపాడగలిగారు. యువతిని వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తనను ఓ యువకుడు శారీరకంగా వేధిస్తున్నాడని హాసిని ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్‎స్టేషన్‎లో ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే హాసిని ఆత్మహత్యాయత్నం చేయడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.