బాలిక అదృశ్యం అయోమయంలో జూబ్లీ బ‌స్ స్టేష‌న్‌ లొ ప్రత్యక్షం ..ఇంటికి చేరిన బాలిక,,

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆరు గ్యారెంటీలలో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే…అప్పటి నుంచి మహిళలు అవసరం ఉన్న లేకున్నా బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. రూపాయ ఖర్చులేకుండా ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలిక అమ్మమ్మ ఊరి నుంచి ఇంటికి వచ్చేందుకు బస్సు ఎక్కింది. అయితే.. కరీంనగర్‌లో దిగాల్సిన బాలిక బొమ్మకల్ బైపాస్ వద్ద బుధవారం అదృశ్యం అయింది. తర్వాత ఏం జరిగిందనే విషయాల్లోకి వెళితే..

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన కనుకుంట్ల నర్సింహం పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడికి వశిస్ట క్రిష్ణ (13) అనే కుమార్తె ఉంది. క్రిస్మస్ సందర్భంగా పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ఉండటంతో అమ్మమ్మ ఊరు పెద్దపల్లికి వెళ్ళింది. సెలవులు పూర్తవ్వడంతో బుధవారం ఉదయం వశిస్టను వాళ్ల తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించి కరీంనగర్‌కు పంపాడు. తాతయ్య అమ్మాయి తండ్రికి బస్సు నెంబర్ మెసేజ్ చేశాడు. కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా స్టేజి దగ్గర తండ్రి అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే బస్సు వచ్చింది కానీ అందులో అమ్మాయి లేదు..దీంతో కండక్టర్‌ను అడగగా బాలిక బైపాస్‌లోనే దిగిందని చెప్పాడు. వెంటనే నర్సింహం బైపాస్ దగ్గరకు వెళ్లి చూడగా బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలిస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయి కోసం ఐదు బృందాలుగా ఏర్పడి గాలించగా.. శుక్రవారం సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం అయింది. అయోమయంలో ఒక చోట దిగాల్సింది మరోచోట దిగడం.. ఫ్రీ బస్ ప్రయాణం కావడంతో తోచిన వైపు బస్ ఎక్కి ప్రయాణం చేసి ఉండవచ్చానిముందు కిడ్నాప్ కేసుగా అనుమానించిన పోలీసులు బాలిక‌ను విచారించ‌గా.. తెలీక హైద‌రాబాద్ వెళ్తున్న బ‌స్సు ఎక్కేసాన‌ని మూడు రోజులుగా ఎక్క‌డికి వెళ్లాలో తెలీక బ‌స్ స్టాప్‌లోనే ఉన్నట్లు తెలిపింది. పాపం తిండి తిప్ప‌లు లేక‌పోవ‌డంతో బాలిక నీర‌సించిపోయింది. వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం బాలిక‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లి త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు.