గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన హిందీ నటుడు మిథున్ చక్రవర్తి..

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి అస్వస్థతకు ఈరోజు గురయ్యారు.

ఆయన కోల్ కతాలోని అపోలో ఆసుప త్రిలోని అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆయనకు గుండెనొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

మిథున్ 2022 ఏప్రిల్ 30న కిడ్నీలో రాళ్లు కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…