మిజోరంలో కూలిన బ్రిడ్జ్‌.. 18 మంది మృతి..

మిజోరంలోని కురుంగ్ నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి బుధవారం కుప్పకూలింది. ఈ ప్ర‌మాదం కార‌ణంగా స్పాట్ లోనే 18 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఐజ్వాల్ కు 21 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ లో ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి కూలిన సమయంలో మొత్తం 28 మందికి పైగా కార్మికులు అక్కడే ఉన్నట్లు స‌మాచారం. ఐజ్వాల్ కు 21 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ లో ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి కూలిన సమయంలో మొత్తం 28 మందికి పైగా కార్మికులు అక్కడే ఉన్నట్లు స‌మాచారం. సైరంగ్ జీరో పాయింట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 196వ నెంబర్ రైల్వే బ్రిడ్జి కూలిపోయింది. 18 మంది మృతదేహాలను వెలికితీశామనీ, గాయపడిన ముగ్గురిని రక్షించామని మిజోరం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 22కు పెరిగింద‌ని సంబంధిత అధికారులు తెలిపారు.