ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు…!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించనున్నారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్‌, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, శంషాబాద్‌ డీసీపీ జదీశ్వర్‌రెడ్డి, మొయినాబాద్‌ సీఐ లక్ష్మీనారాయణ సిట్‌లో సభ్యులుగా నియమించారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో దర్యాప్తును కొనసాగించడానికి మొయినాబాద్‌ పోలీసులకు హైకోర్టు మంగళవారం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.