ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితులకు బెయిల్‌

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిర్‌ మంజూరైంది. రామంచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.3 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీ ఇవ్వాలని నిందితులకు కోర్టు సూచించింది. ప్రతి సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.