కోమటిరెడ్డి సవాల్ పై స్పందించినా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..రాజీనామా పత్రంతో మునగాల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన..

*కోమటిరెడ్డి సవాల్ పై స్పందించినా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

*రాజీనామా పత్రంతో మునగాల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కూ వెళ్లిన ఎమ్మెల్యే గొల్ల మల్లయ్య యాదవ..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా పత్రంతో ఇక్కడికి రావాలంటే కోరారు..24 గంటలు విద్యుత్ ఇస్తున్నామ్.రైతుల ముందుకు రావాలి.రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం.కాంగ్రేస్ నాయకులు మాటలు నమ్మవద్దు.

*ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్..

ఎంపీ కోమటి రెడ్డి రైతులకు 10 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపిస్తా, రాజీనామా చేస్తావా అని మంత్రి కేటీఆర్ కు విసిరిన సవాల్ పై కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్,, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి సై అన్నారు. గురువారం రాజీనామా పత్రంతో మునగాల
సబ్ స్టేషన్ వద్దకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేరుకొని దమ్ముంటే సబ్ స్టేషన్ వద్దకు రావాలని ఎంపీ కోమటిరెడ్డి సవాల్ విసిరారు. కాగా ఎమ్మెల్యే ప్రతి ప్రతి సవాలకు ఎదురుపడి నిలబడలేక ఎంపీ కోమటిరెడ్డి రాలేదు. అనంతరం వందలాది మంది రైతులతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ………టిఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. మండు వేసవిలో కూడా కోతలు లేకుండా ప్రజలకు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమైనవని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు ఆ మాటలకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు అవాక్కులు చవాకులు పేరుతున్నారని విమర్శించారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అన్నారు. నేడు సంక్షేమంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని, కాంగ్రెస్ నాయకులు దుకాణం మూసుకోవాలని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, రైతులు తదితరులు పాల్గొన్నారు…