కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి…!

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (mla laasya Nandita)మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు…

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి, ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు…
ఓఆర్‌ఆర్‌పై పటాన్‌చెరు నుంచి మేడ్చల్ వెళ్తున్న క్రమంలో సుల్తాన్‌పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె స్పాట్‌లోనే మృతి చెందారు. లాస్య ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీకొట్టటంతో విషాదం చోటుచేసుకుంది. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నార్కట్‌పల్లి ప్రమాదంలో ఆమె కారు దెబ్బతినగా.. ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశారు. ఆ కారు కూడా ప్రమాదానికి గురికావటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు..

వెంటాడిన‌ ప్రమాదాలు..

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..

వెంటాడిన ప్రమాదాలు..
రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు..
ఎమ్మెల్యే గా కలిసి‌రాని‌ కాలం..

లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి

నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి‌ ప్రమాదానికి గురై..

మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువ‌ఎమ్మెల్యే మృతి..

నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి.. లాస్య నందితకు తీవ్రగాయాలు..

పది రోజులు గడువక‌ ముందే మరో రోడ్ ప్రమాదం..
ఓఆర్ఆర్ వద్ద డివైడర్ ను ఢీ కొని పల్టీలు కొట్టిన ఎమ్మెల్యే కారు

యువ‌ఎమ్మెల్యే లాస్య‌నందిత మృతి..

తండ్రి సాయన్న ఆశయాలు‌ నెరవేర్చకుండానే తండ్రి వద్దకి..