పోలీసులు అరెస్ట్ చేసి, తనను ఎక్కడకు తీసుకెళ్తున్నారో తెలియడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇచ్చేద్దామని ప్రగతిభవన్ కు వెళ్తే.. గేటు వద్దే తనను ఆపేశారని చెప్పారు._ బుల్లెట్ ప్రూఫ్ వాహనం తాళాన్ని అక్కడే ఉన్న పోలీసు అధికారులకు ఇస్తే తీసుకోకపోవడంతో వాటిని అక్కడే పాడేశానని చెప్పారు. ఇంతలోనే పంజాగుట్ట ఇన్స్ స్పెక్టర్ వచ్చి తను అరెస్ట్ చేసి డీసీఎంలో కూర్చోబెట్టారని అన్నారు.
అరెస్ట్ చేసిన తనను ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా తెలియడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతిభవన్ వెళ్లే ముందు తన వెంట ఉన్న గన్ మెన్లను తీసుకెళ్లలేదని, ఒంటరిగానే వెళ్లానని తెలిపారు. పాడైన బూల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకు ఎందుకు కేటాయించారని అడిగేందుకే ప్రగతిభవన్ వెళ్లానని చెప్పారు..