ప్రతీ కార్యకర్త కుటుంబానికి తెరాస పార్టీ అండగా నిలుస్తుంది.. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..

సూర్యాపేట జిల్లా.
మఠంపల్లి మండలం బక్కమంతల గూడెం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిక….
అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. …….సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేస్తున్నామని అన్నారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నదని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం,డంపింగ్ యార్డు, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. గ్రామాల్లో గతంలో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళ తో దర్శనమిస్తున్నాయని అన్నారు. అనేక గ్రామాల్లోనూ ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతున్నదని అన్నారు. ప్రతీ పల్లెకు పక్కా రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. గ్రామాల్లోనూ మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. రైతులకు పంట పెట్టుబడిసాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు. ఈ రెండు పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 మేనమామ కట్నంగా ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తున్నదని అన్నారు.హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ,
నిబద్ధతతో హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.