అబద్ధపు ప్రచారులతో నియోజకవర్గ ప్రజలను ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి మోసగిస్తున్నాడు. మున్సిపల్ లేఔట్ల స్థలాలను కాపాడండి అని *హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.అన్నారు. 2019 ఉప ఎన్నికల కన్నా ముందు హుజూర్నగర్ సంబంధించి అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు.ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కూడా లేఅవుట్ స్థలాలకు ఎందుకు ఫెన్సింగ్ వేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే లేవుట్ స్థలాలు మొత్తం ఆక్రమణకు గురయ్యాయని విమర్శించారు. మున్సిపల్ లేఅవుట్ స్థలాలకు సంబంధించి నిజ, నిజాలు నీగ్గు తేల్చేందుకు బహిరంగ చర్చకు సిద్ధం అని ఆయన అన్నారు. దమ్ముంటే ఉత్తంకుమార్ రెడ్డికి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అఖిలపక్ష నాయకులైన పరవాలేదు జిల్లా మీడియా అయిన లోకల్ మీడియా అయినా పర్వాలేదు డేటు మీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పండి సమయం మీదే చర్చకు మేమంతా సిద్ధంగా ఉన్నాం అని ఎమ్మెల్యే గారు అన్నారు. మున్సిపల్ లేఅవుట్ల కు సంబంధించి నిజం నీగ్గు తేల్చాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా మున్సిపాలిటీ నుండి ఎలాంటి అనుమతులు లేవని అన్నారు. నెలకు 80 వేల రూపాయలు కాంగ్రెస్ భవన్ నుండి ఆ పార్టీ నాయకులు కిరాయిలు పొందుతున్నారని ఆరోపించారు. అబద్ధపు మాటలు, మాయ మాటలు మోసపు వాగ్దానాలతో ఉత్తంకుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని అన్నారు. లేఔట్ల పేరుతో నియోజకవర్గంలో పిలుపునిచ్చి కనీసం వంద మంది నాయకులతో కూడా ధర్నా చేయలేకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కరపత్రాలు వేసి ప్రజలను రప్పిం చేందుకు చేసే ప్రయత్నాలు విఫలమైనాయని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా అబద్ధపు ప్రచారాలతో మోసగించిన ప్రజలు నమ్మరని అన్నారు….
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.