విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారి పైన అయినా కఠిన చర్యలు తప్పవు…. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..

*విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారి పైన అయినా కఠిన చర్యలు తప్పవు…. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..*

*సూర్యాపేట జిల్లా*

హుజూర్ నగర్ పట్టణంలో 100పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన *హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి….*..

అనంతరం హాస్పటల్ సిబ్బంది తో మాట్లాడుతూ

ప్రభుత్వం ఎంతో నిధులు వెచ్చించి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఆశయంతో ఉన్నదని, అలాంటి ఆశయానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలవాలని సిబ్బందిని కోరారు….

సిబ్బంది సరైన సమయపాలన పాటిస్తూ, ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను గౌరవించాలని అన్నారు….

నిరుపేద రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనీ డాక్టర్ లని కోరారు….

సమయపాలన పాటించని సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు….

పేషెంట్ల వద్దకు వెళ్లి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకోవడం జరిగింది…