ఉత్తమ్ వయసు పెరుగుతున్న కొద్దీ తన సహనం కోల్పోతున్నారు….ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..

*సూర్యాపేట జిల్లా..*

హుజూర్ నగర్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రెస్ మీట్..

*ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ..*

ఈ నెల 6న హుజూర్ నగర్ కి రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయడానికి హెలికాప్టర్ ద్వారా హుజూర్ నగర్ కు చేరుకుంటారు…

అనంతరం 11 గంటలకు భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు…

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది..

ఎమ్మెల్యే గా గెలిచిన దగ్గరి నుంచి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నాం..

హుజూర్ నగర్ అభివృద్ధి చేయడానికి గాడిద కాళ్ళు కూడా పట్టుకోవడానికి సిద్దం…

ఉత్తమ్ వయసు పెరుగుతున్న కొద్దీ తన సహనం కోల్పోతున్నారు…

ఉత్తమ్ రాజకీయ సన్యాసం చేయడం కాదు..ప్రజలే ఆయనకి సన్యాసం ఇచ్చేలా ఉన్నారు…

2019లో ఎంపీ గా గెలవడమే అతని చివరి గెలుపు

ఇకపై 50వేల ఓట్లు మెజారిటీ సంగతి దేవుడు ఎరిగు…
ముందు 50 వేల ఓట్లు తెచ్చుకో…

ఏ సమయంలో
ఏ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారో కూడా అతనికి కూడా అవగాహన లేదు..

ఉత్తమ్ ను చూసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులే సిగ్గుతో తల దించుకుంటున్నారు…

ఆయన విమర్శలతో కాలం గడుపుతున్నారు మేము అభివృద్ధితో కాలం గడుపుతున్నాం. ఆయనకి మాకు చాలా తేడా ఉందని అన్నారు..