ఎమ్మెల్యే శంకర నారాయణ కాన్వాయ్‌పై డిటోనేటర్‌తో దాడి..!!

ఎమ్మెల్యే శంకర నారాయణ కాన్వాయ్‌పై డిటోనేటర్‌తో దాడి

*గోరంట్ల.. పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర నారాయణ కాన్వాయ్‌పై డిటోనేటర్‌ దాడి జరిగింది! సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది..

ఎమ్మెల్యే శంకర నారాయణ ఆధ్వర్యంలో సుమారు 12 గంటలకు గ్రామంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభించారు. ఆయన వాహనం దిగి కొంత దూరం నడిచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని ఓ వాహనంపై ఓ ఆకతాయి డిటోనేటర్‌ విసరడం కలకలం రేపింది. అయితే, డిటోనేటర్‌ గురితప్పి పొదల్లో పడటం, అది పేలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న నాయకులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు..