తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది

R9TELUGUNEWS.com: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 9న నోటిఫికేషన్‌, 29న పోలింగ్‌.. అదే రోజు లెక్కింపు జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో ఈ ఏడాది మే 31న మూడు, తెలంగాణలో జూన్‌ 3వ తేదీన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ సమయంలో ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది.