స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక పోలింగ్..కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాలలో 1439 మంది ఓటర్ లకు గాను 1437 మంది ఓటర్ లు (99.86%,) ఓటు హక్కు వినియోగించుకున్నారు..
మహబూబ్ నగర్ ఎం.పి.డి. ఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లో మొత్తం 245 మంది కి 245 మంది ఓటర్ లు 100 శాతం పోలింగ్ నమోదు అయింది..

కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్ని క పోలింగ్ సందర్భంగా.. స్వయంగా ఊరు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకు న్నారు సీఎం రేవంత్ రెడ్డి.మొత్తం ఒక వెయ్యి 439 మంది ఓటర్ల కోసం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.కొడంగల్ ఎంపీడీవో ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి, కొల్లూపూర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు.మధ్యాహ్నం 2 గంటల వరకు 89 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియ నుంది.లోకల్ బాడీ బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి తోపాటు స్వతంత్ర అభ్యర్థి గా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు..