మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల..

మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల

మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వెల్లువలా దాఖలు అయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలతో ముగిసింది. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 90కి పైగా అభ్యర్థులు మొత్తం 100 సెట్ల నామినేషన్ల దాఖలు చేయగా ఈ ఒక్క రోజే 52 నామినేషన్లు నమోదయ్యాయి. ఇక రేపు నామినేషన్ల పరిశీలన ఉండనుంది. 26 తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17 తేదీన ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇక మొత్తం 142 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బరిలో ఉన్న ముఖ్యమైన అభ్యర్థులు విరె…..

1.వాణీ దేవి – టిఆర్ఎస్.

2.చిన్నారెడ్డి – కాంగ్రెస్

3.రామచంద్రరావు – బీజేపీ

4.ఎల్. రమణ – టీడీపీ

5. ప్రొ. నాగేశ్వరరావు – వామపక్ష పార్టీలు

6.హర్షవర్ధన్ రెడ్డి – కాంగ్రెస్ రెబల్