పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌….

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎస్‌ వాణీదేవి

వరంగల్‌-ఖమ్మం- నల్లగొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి..

బరిలో 164 మంది అభ్యర్థులు
దినపత్రిక సైజులో బ్యాలెట్‌పేపర్‌
8 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్‌
పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సామగ్రి
విధుల్లో 7,560 మంది సిబ్బంది
15 వేల పోలీసులతో పటిష్ఠ భద్రత
50%శాతం కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌
అన్ని ఏర్పాట్లు పూర్తి: సీఈవో గోయల్‌
ప్రతి ఒక్కరూ ఓటేయాలని వినతి..

నియోజకవర్గాలవారీగా ఓటర్లు
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌

పురుషులు 3,36,256
మహిళలు 1,94,944
థర్డ్‌జండర్‌ 68
మొత్తం 5,31,268
పోలింగ్‌ స్టేషన్లు 799
వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ

పురుషులు 3,32,634
మహిళలు 1,72,864
థర్డ్‌జండర్‌ 67
మొత్తం 5,05,565
పోలింగ్‌ స్టేషన్లు 731
ఓటెలా వేయాలి?
సాధారణ ఎన్నికల్లో ఓటేయడానికి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడానికి చాలా తేడా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా స్వస్తిక్‌ ఓటు ముద్ర వేయడం కానీ, ఈవీఎంలలో బటన్‌ నొక్కే విధానం ఉండదు బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటేయాలి.

ఓటర్‌ గుర్తింపుకార్డు లేదా.. ఈసీ నిర్ణయించిన ఆధార్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌లైసెన్స్‌. సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ, ఎంపీ గుర్తింపుకార్డు, పాన్‌ కార్డు, విద్యాసంస్థలు జారీచేసిన కార్డు, డిగ్రీ లేదా డిప్లొమా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, దివ్యాంగుల గుర్తింపుకార్డు లలో ఏదైనా ఒకటి తీసుకుపోవాలి….

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్, షేక్​పేట్​ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి శ్రీ కేటీఆర్.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కోడలు స్రవంతి..

సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.

సూర్యాపేట జిల్లా…

తిరుమలగిరి మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ లో పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే డా,, గాదరి కిశోర్ కుమార్. కమల కిశోర్..

సూర్యాపేట జిల్లా

మఠంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్న హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి…

నార్కటపల్లి మండల కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ నందు తన శ్రీమతితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న బండ నరెందర్ రెడ్డి, చైర్మన్, జి.ప్ర.ప.నల్లగొండ..