కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్!

కాంగ్రెస్ నాయకత్వంపై ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ ఫైర్తె
గాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, ఇదే సమయంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన రాములు నాయక్.. కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కొంత మంది రెడ్డి నాయకులు, డీసీసీ అధ్యక్షులు తనకు సహకరించలేదని ఆరోపించిన ఆయన.. కరపత్రాలు కూడా పంచలేదని వాపోయారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించారన్న ఆయన.. ఈ ఎన్నికల్లో క్యాష్.. అండ్ క్యాస్ట్ పని చేసిందని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలు వచ్చినా కోదండరాం పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఇన్ని ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు రాములు రాయక్.. ఈ ఎన్నికలపై గాంధీ భవన్‌లో సమావేశం పెట్టి అన్నీ చర్చిస్తామన్న ఆయన.. నేను గెలిస్తే చాలా మందికి ఇబ్బంది అవుతుందనే ఓడగొట్టారంటూ మండిపడ్డారు.
ఇక, నియోజకవర్గానికి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఐదు వేలైనా..? ఉంటుంది.. అవి కూడా పడలేదు