మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు…

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సరూర్‌నగర్‌ (Saroornagar) ఇండోర్‌ స్టేడియంలోని కౌంటింగ్‌ సెంటర్‌లో (Counting center) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. కేంద్రంలోని రెండు గదుల్లో ఓట్ల లెక్కింపునకు మొత్తం 28 టేబుళ్లను అధికారులు ఏర్పాటుచేశారు. ఒక్కో గదిలో ముగ్గురు ఏఆర్వోలను, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్ద అదనంగా మరో ముగ్గురు ఏఆర్వోలను నియమించారు. కౌంటింగ్‌లో ఏ అభ్యర్థికీ తొలి ప్రాధాన్య ఓట్లలో 50 శాతానికిపైగా రాకపోతే సెకండ్‌ ప్రయార్టీ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు..