నేడే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు…

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేడే

మధ్యాహ్నం కల్లా ఫలితాలు!

స్థానిక సంస్థల కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపును మంగళవారం చేపట్టనున్నారు. ఈ నెల 10న ఎన్నికలు జరిగిన ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లోని కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. తొలుత కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్స్‌లను తెరిచి, 25 ఓట్లను ఒక బండిల్‌గా కడతారు. అనంతరం కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో మూడోవంతు ఓట్లు సాధించిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యంలో ఫలితం తేలకుంటే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించనున్నట్టు అధికారులు తెలిపారు.