నేడు స్థానిక సంస్దల ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్

నల్లగొండ జిల్లా స్దానిక సంస్దల ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ నేడు (డిసెంబర్ 14 ) జరగనుంది….
R9TELUGUNEWS.COM.
జిల్లా కేంద్రంలోని మహిళాసమాఖ్య భవనంలో కౌంటింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు….ఈ ఎన్నికల్లో మెత్తం 7గురు అభ్యర్దులు పోటీ చేశారు..అందులో ఒకరు తెరాస పార్టీ అభ్యర్ది ఎంసి కోటిరెడ్డి కాగా,, మిగితా ఆరుగురు స్వతంత్రులు… డిసెంబర్ పదిన జరిగిన పోలింగ్ లో 97.01 శాతం పోలింగ్ నమోదు అయింది…. మెత్తం 1271 ఓట్లలో 1233 ఓట్లు పొలయ్యాయి….రేపు చేపడుతున్న కౌంటింగ్ కోసం నాలుగు టేబుల్లను ఏర్పాటు చేశారు..ప్రతి టేబుల్ కు కౌంటింగ్ సుపర్ వైజర్, అసిస్టెంట్ సుపర్ వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ తో పాటు మరో నలుగురు సహయకుల్ని నియమించారు… ..మెత్తం 200 మంది సిబ్బందిని కౌంటింగ్ కోసం నియమించారు….రేపు ఉదయం ఆరున్నర గంటల లోపు కౌంటింగ్ స్టాఫ్ వారికి కేటాయించిన టేబుల్ల వద్దకు చేరుకుంటారు… సరిగ్గా ఎనిమిది గంటలకు అభ్యర్దుల సమక్షంలో స్ట్రాంగ్ రూం ను ఒపెన్ చేసి అందులో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్ లను కౌంటింగ్ హాల్ కు తరలిస్తారు…. అభ్యర్దుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్ లను ఒపెన్ చేసి అందులో ఉన్న బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున బండీల్స్ కట్టి వాటిని 4 టుబుల్స్ కు పంపిణీ చేస్తారు……. మెదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు….. ఆ తర్వాత చెల్లుబాటైన ఓట్లను లెక్కించి ,,చెల్లుబాటైన ఓట్లలో సగానికి కంటె ఒక్క ఓటును అదనంగా చేర్చి గెలుపు కోటాను నిర్ణయిస్తారు రిటర్నింగ్ అధికారి… మెదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే గెలుపు కోటా చేరుకున్న అభ్యర్దిని విజేతగా ప్రకటిస్తారు…..ఒక వేల ఏ అభ్యర్ది కోటాను చేరుకోనట్లయితె , అభ్యర్దుల ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించి ఓట్ల లెక్కింపు చేపడుతారు..ఇలా చివరిగా మిగిలిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు రిటర్నింగ్ అధికారి……ఈ కౌంటింగ్ కోసం 300 మంది పోలీసులతో మూడెంచల భద్రత వ్యవస్దను ఏర్పాటు చేశారు…సీసీ కెమెరాల నడుమ వెబ్ కాస్టింగ్ తో ఈ కౌంటింగ్ ను నిర్వహిస్తున్నారు….. ఇక కోవిడ్ నిభంధనల్ని కఠినంగా అమలుచేస్తున్నారు…. రెండుడోస్ ల వ్యాక్సినేషన్ సర్టిఫీకెట్ సమర్పించిన వారిని మాత్రమే కౌంటింగ్ హాల్ లకి అనుమతిస్తున్నారు……..