ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎమ్మెల్యే కోటా కింద మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ ఎన్నికల్లో పోటీ పడాలనుకునే అభ్యర్థుల నుంచి ఈ నెల 16 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు..
వీటిని 17వ తేదీన పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 22గా ఉంది. పోటీ ఉంటే ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.