సృహతప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత…

జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సృహతప్పి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల లో రోడ్ షో లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్..రాయికల్ మండలం ఇటిక్యాలలో ప్రచార వాహనంలోనే స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్సీ కవిత. అయితే… కాసేపటికి మళ్ళీ తేరుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.

వీడియో చూడాలంటే ఈ కింద లింక్ ని ఓకే చేయండి..
https://youtube.com/shorts/2YrnE-QoNJ0?si=PkuzAz3VS-qORhbD
*జగిత్యాల రోడ్ షోలో డిహైడ్రేషన్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత…*

ఇక అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత “ఎక్స్” లో ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా తాను స్వయంగా వీడియోను చిత్రీకరించారు. ఎన్నికల ప్రచారానికి గాను నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దాన్ని వీడియోలో ఆమె చిత్రీకరించారు.