సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత..

*🔹సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత*

ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది

ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదు..

దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది..

కానీ తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యం..

రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.