ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ సోదాలు..

ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ సోదాలు

ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కవిత భర్త అనిల్‌ బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి..

మాదాపూర్‌లో అనిల్‌ సోదరి అఖిల నివాసంలో అధికారులు తనిఖీలు చేపట్టారు..

మరోవైపు కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 12.30 తర్వాత ఆమెను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. మద్యం కేసులో దిల్లీ సీఎంను తమ కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు.. కేజ్రీవాల్, కవితను ఒకేసారి విచారించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో కవితను మరో 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరనున్నట్లు సమాచారం..