లిక్కర్ స్కాం కేసు బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేసిన కవిత..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు వేడి తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా కవిత.. బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టుల్లో పిటిషన్‌ దాఖలు చేశారు.ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసిన 29 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు బంజారాహిల్స్‌ సీఐ నరేందర్‌ తెలిపారు. కాగా, వారిలో 26 మంది అరస్ట్‌ చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇక, నిందితులపై ఐపీసీలో 341, 147, 148, 353, 332, 509, రెడ్‌ విత్‌ 149 కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.