దిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షకు అనుమతి నిరాకరణ..

MLC Kavitha..

ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడెలా రద్దు చేస్తారని కవిత ఆగ్రహం

చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌తో భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన నిరసన దీక్షకు దిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు..శుక్రవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమతి రద్దు చేస్తున్నట్లు కవితకు పోలీసులు తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతుండగానే సమాచారం అందించారు. ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు ఎలా రద్దు చేస్తారని కవిత ప్రశ్నించారు.

తమ దీక్షలో మార్పు లేదని.. యథావిధిగా నిరసన కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. దీనిపై దిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు..