ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కదురు..

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదెరైంది. ఆమె దాఖలు చేసిన పిటీషన్‌ను త్వరగా విచారించేందుకు సుప్రీం అంగీకరించలేదు. 24ననే విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే 20న విచారణకు రావాలంటూ కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా సుప్రీం తీర్పు తర్వాతే విచారణకు వస్తానంటూ కవిత పేర్కొన్నారు.అయితే కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. దీంతో కవిత 20వ తేదీన ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.