ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో వేడెక్కిన రాజకీయం..

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కవిత అరెస్టు.. ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం ఇది బిజెపి కుట్రే అంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు.. విచారణకు మాత్రమే హైకోర్టు ఆదేశాలు ఇస్తే దాన్ని బేఖాతరు చేస్తూ అరెస్టు ఎలా చేస్తారంటే కేటీఆర్ వాగ్వాదం దిగిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నారు సమయంలో కేటీఆర్ పై కూడా కేసు నమోదు చేయడంతో మరి కొంత రాజకీయం వేడెక్కింది… స్వయాన నరేంద్ర మోడీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లో రోడ్డు షోలు చేయడంతో మరికొంత బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది..

తెలంగాణలో సంచలన పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైన సందర్భంగా.. ప్రధాన పార్టీలన్ని ప్రచార పర్వాన్ని మొదలుపెట్టగా..

అత్యధికంగా ఎంపీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తు న్నాయి. అయితే.. తెలంగా ణలో మెజార్టీ సీట్లు గెలుచు కునేందుకు బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలుపెట్టగా.. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే స్వయంగా రంగంలోకి దిగారు.

ఈ నేపథ్యంలోనే.. తెలం గాణలో మోదీ పర్యటిస్తు న్నారు. శుక్రవారం మార్చి 15న హైదరాబాద్‌లోని మీర్జాల్ గూడా నుంచి మల్కాజ్‌గిరి వరకు మోదీ రోడ్ షో చేపట్టారు. ఈ రోడ్ షోలో సికింద్రాబాద్, మల్కా జ్‌గిరి అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు.

ఓవైపు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్న సమ యంలోనే.. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత నివాసంపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించటమే కాకుండా.. అరెస్ట్ కూడా చేయటం ఇప్పుడు సర్వత్రా సంచలనాన్ని క్రియేట్ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్ప డ్డారంటూ.. సుమారు ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. ఆమె దగ్గరున్న ఫోన్లు సీజ్ చేసి.. అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చేసి.. అదుపులోకి తీసుకున్నారు.

దీంతో.. కవిత నివాసం దగ్గరికి పెద్ద ఎత్తున బీఆర్ ఎస్ శ్రేణులు చేరుకుని నినాదాలతో హోరెత్తిస్తు న్నారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది..