కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఈడి..!!

*హైదారాబాద్:*

*🔹కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఈడి.

_• కవిత ఇంట్లోకి కేటీఆర్, హరీశ్ రావులను మాత్రమే అనుమతిచ్చిన పోలీసులు…_

_• ఈరోజు రాత్రి 8.45ని.లకు ఢిల్లీ ఫ్లైట్ కి టికెట్స్ బుక్ చేసిన ఈడీ…_

_కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఈఢీ.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితను అరెస్ట్‌కు ముందు ED అధికారులు.. ఆమెకు అరెస్ట్‌ వారంట్‌తో పాటు సెర్చ్‌ వారెంట్‌ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలిసింది. కవితను ఢిల్లీ తరలించే అవకాశముంది.

అరుణ్‌పిళ్లైకి క్రియేటివ్‌ డెవలపర్స్‌ భాగస్వాములు, రవిశంకర్‌ చెట్టి రూ.5 కోట్లకు హైదరాబాద్‌లో భూమి అమ్మారన్న ఆరోపణలున్నా వారెవరూ అరుణ్‌పిళ్లైను కలవలేదు. ఈ ఒప్పందాన్ని ఫీనిక్స్‌ రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌నకు చెందిన శ్రీహరి చర్చలు జరిపి ఖరారు చేశారు. భూమి కొనుగోలు నిమిత్తం సంస్థకు ఒకరు డబ్బులు బదిలీ చేస్తారని చెప్పిన శ్రీహరి.. ఎవరు డబ్బులు బదిలీ చేశారనేది రవిశంకర్‌ చెట్టికి చెప్పలేదు. అయితే, ఎన్‌గ్రోత్‌ కాపిటల్‌ పేరుతో ఫీనిక్స్‌ గ్రూపునకు చెందిన శ్రీహరి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు బుచ్చిబాబు తన వాంగ్మూలం ఇచ్చారు.

మార్కెట్‌ ధర చదరపు అడుగు రూ.1,760 ఉంటే రూ.1,260 మాత్రమే చెల్లించారు. కవితతో గణనీయమైన ఆర్థిక లావాదేవీలున్న వ్యక్తి రవిశంకర్‌తో భూమి కొనుగోలుకు చర్చలు జరిపినట్లు నిర్ధారణకు వచ్చాం. ఇండోస్పిరిట్స్‌లో కవిత తరఫున అరుణ్‌ పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించి రూ.32.86 కోట్లు అందుకున్నారు. పిళ్లై సూచన మేరకు రూ.25.5 కోట్లు నేరుగా ఇండోస్పిరిట్స్‌ నుంచి పిళ్‌లై ఖాతాకు బదిలీ అయ్యాయి. ..