తొమ్మిది రాష్ట్రాల్లో భాజపా అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది..ఎమ్మెల్సీ కవిత…

తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రాష్ట్రంలో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కవిత మాట్లాడుతూ..9 రాష్ట్రాల్లో భాజపా అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రానికి మోదీ కంటే ముందు ఈడీ రావడం సహజమే. నాపై, ఎమ్మెల్యేలు, మంత్రలపైన కేసులు పెట్టడం హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ మాత్రమే. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటామని ముందే చెప్పాం. మీడియాలో లీకులు ఇచ్చి మా ఇమేజ్‌ దెబ్బతీయలేరు’’ అని కవిత అన్నారు..