ఏడు రోజులపాటు ఎమ్మెల్సీ కవితను ED కస్టడీ అనుమతి…!

ఏడు రోజులపాటు కవితను ED కస్టడీ అనుమతి…

7రోజుల పాటు కవితను కస్టడీ లో విచారించనున్న ఈడి అధికారులు..

సౌత్ గ్రూప్ నుంచి అప్ పార్టీకి 100 కోట్ల ముడుపులు అందించిన కవిత..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్‌ షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. అయితే కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దీంతో కోర్డు 7 రోజుల కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోనే ఉంటారు. 23న తిరిగి మళ్లీ కోర్టులో హాజరు పర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు..