కవిత అరెస్ట్? విచారణకు రావాలని ఈడీ. అరెస్టుపై సర్వత్ర ఉత్కంఠ..

🔴 *BREAKING NEWS*

⚪️ ఢిల్లీ:

*ఉదయం 10 గంటల తర్వాత తుగ్లక్ రోడ్డు నివాసం నుంచి నుంచి ఈడీ ఆఫీస్ కు కవిత..

ఢిల్లీకి చేరుకున్న బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, భారత జాగృతి నేతలు..

అబ్దుల్ కలాం రోడ్ లోని ఈడీఆఫీస్ పరిధిలో 144 సెక్షన్ విధింపు

కవిత అరెస్టు అవుతారా? లేదా? అనే దానిపై సర్వతా ఉత్కంఠ ..ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. కొన్ని నెలలుగా వారంతా జైల్లో మగ్గుతున్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నా.. కోర్టు కనికరించడం లేదు. అంత పక్కాగా సీబీఐ, ఈడీ విచారణ చేస్తోంది. స్కాంలో పాత్రదారులే ఇన్నాళ్లుగా జైల్లో ఉంటుంటే.. మరి, సూత్రధారులుగా పేర్లు వినిపిస్తున్న సిసోడియా, కవిత లాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? అనే చర్చ నడుస్తోంది.

మనీశ్ సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆప్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. అవన్నీ ఒక్కరోజు హడావుడికే పరిమితం అవుతున్నాయి. మళ్లీ మర్నాడు అంతా రొటీన్. దేశ రాజధానిలో ఆప్ లాంటి బలమైన పార్టీ ఆందోళనలు చేస్తేనే.. కేంద్రంకానీ, దర్యాప్తు సంస్థలు కానీ ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాయి. తమ పని తాము చేసుకుపోతున్నాయి. అలాంటిది, కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ ఆగమాగం అవుతుందా?

“తెలంగాణ తల వంచదు”.. ఈడీ నోటీసులు రాగానే కవిత ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. తనను అరెస్ట్‌ చేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని అంటున్నారు. అరెస్టును.. తెలంగాణ సమాజానికి ముడిపెడుతున్నారు. కేంద్రం తెలంగాణపై పగపట్టిందనేలా మెసేజ్ ఇస్తున్నారు. అందుకే, కవిత అరెస్టుకు.. తెలంగాణ సమాజానికి ఏం సంబంధం అంటూ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే.. సేమ్ టు సేమ్ ఆమ్ ఆద్మీ పార్టీలానే బీఆర్ఎస్ శ్రేణులు ఒకరోజో రెండు రోజులో ఆందోళనలు, ధర్నాలు చేస్తాయి. ఆ తర్వాత? మళ్లీ ఎవరిగోల వారిదే. అనే ఆలోచనలో కూడా రాజకీయ వర్గాలు ఉన్నాయి..