ఢిల్లీలోని ఈడీ ఆఫీసు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు…MLC కవిత కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు..

MLC కవిత కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఢిల్లీలోని సీఎం కేసీఆర్‌ నివాసం వద్దకు తరలి వస్తున్నారు…

ఢిల్లీలోని ఈడీ ఆఫీసు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు…

మనీశ్‌ సిసోడియా,పిళ్లై, కవిత విచారణ నేపథ్యంలో ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు…

ఈడీ ఆఫీసు వద్దకు మీడియాను అనుమతించని పోలీసులు…

ప్రధాన రోడ్డు వరకే మీడియాను పరిమితం చేశారు…

ఢిల్లీలోనే కేటీఆర్‌,హరీశ్‌ రావు ఉన్నారు…

నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో న్యాయ నిపుణులతో కేటీఆర్‌ సంప్రదింపులు జరుపుతున్నారు…

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత.నేడు ఈడీ ఎదుట హాజరు…

ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఆమె చేరుకోనున్నారు. 11 గంటలకు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

సౌత్ గ్రూప్​లో కవిత కోసమే పని చేశామని అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్​మెంట్లే కవిత విచారణలో కీలకం కానున్నాయి.

ఫోన్ల ధ్వంసం, ఢిల్లీ, హైదరాబాద్ లో మీటింగ్స్, ఆప్ కు హవాలా రూపంలో డబ్బు తరలింపు వంటి అంశాలపై ఈడీ ఫోకస్ పెట్టనున్నట్టు తెలిసింది.

కవితను ముందు విడిగా, ఆ తర్వాత జాయింట్ సెషన్ లో విచారిస్తారని సమాచారం. కవిత అనుచరుడు పిళ్లై ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు. అలాగే తీహార్ జైలులో ఉన్న మనీశ్ సిసోడియాను 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు శుక్రవారం ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో కవిత విచారణలో మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై కూడా ఉంటారని చర్చ జరుగుతోంది.

శనివారం ఉదయం 11 గంటలకు తన లాయర్‌తో కలిసి కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు…

సౌత్‌ గ్రూప్‌ ఫండింగ్‌పై కవితను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు…