రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత..

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు…

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

కాగా, ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఆదిలాబాద్‌ సభలో ప్రధాని మోదీని రేవంత్‌ పెద్దన్న అని సంభోదించారు. దీంతో, బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటే అని అర్ధం అవుతుంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ.. ఎలా పెద్దన్న అవుతాడని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాతు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం కొత్తగా జీవో నంబర్‌-3ను తీసుకొచ్చింది. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. దీనికి నిరసనగా ఈనెల ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లతో ధర్నాలో పాల్గొంటాం. నిరసన కార్యక్రమాలు చేపడతాం. మహిళలకు, అభ్యర్థులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. 33 శాతం రావాల్సిన రిజర్వేషన్ పూర్తిగా వెనక్కి పోయింది. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉంది’ అంటూ కామెంట్స్‌ చేశారు..