టీఎస్ పీఎస్పి చైర్మన్ పదవి నుండి మహేందర్ రెడ్డిని తొలగించాలి:కవిత.

తెలంగాణ రాష్ట్ర గీతం గురించి సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్ప దంగా ఉందని ఎంఎల్‌సి కవిత అన్నారు.

కవిత ఈరోజు తన నివాసం లో మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడు జై తెలంగాణ అని కూడా అనలేదని విమర్శలు గుప్పించారు.

తెలంగాణ తల్లి విగ్రహం కవితలాగా ఉందని సిఎం రేవంత్ అనడం మంచిది కాదని, తాను తెలంగాణ ఆడబిడ్డనే కదా? అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి సిఎం రేవంత్ మాట్లాడటం ఏంటి అని ప్రశ్నించారు.

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తుండడంతో న్యాయ విచారణ జరపాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని, విద్యుత్ సంస్థల్లో ఎపి వాళ్లను డైరెక్టర్‌లుగా నియమించారని, తెలంగాణ అసెంబ్లీకి ఎపి సలహా దారులు ఎందుకు అని కవిత ప్రశ్నించారు.