హుజుర్ నగర్ లో ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు.

తెలంగాణ జాగృతి హుజుర్ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా కల్వకుంట్ల కవితక్క జన్మదిన వేడుకలు.

నేడు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు M. L. C *కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా హుజుర్ నగర్ పట్టణంలో గల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది అనంతరం కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర కార్యదర్శి K. L. N రావు, జిల్లా నాయకులు Sk మస్తాన్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు జాగృతి సంస్థను స్థాపించారన్నారు కవితక్క చేసిన కృషి వల్ల బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం వచ్చిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది అభాగ్యులను తన సొంత ఖర్చులతో అదుకున్నారన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న కవిత గారు రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని మరింతగా ప్రజలకు సేవ చేసే శక్తి సామర్ధ్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాధించాలాని దేవుడిని కోరుకుంటున్నామని జాగృతి నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ దశరథ్ నాయక్, జాగృతి జిల్లా కో-కన్వీనర్ కుక్కునూరి గోవర్ధన్, జిల్లా అధికార ప్రతినిధి రణబోతు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కన్వీనర్ దుండిగాల నారాయణ,మామిడి పన్నీరు, నర్సింహ రావు ఉదారి భద్రి,,నాగుల మీరా,యాకయ్య Sk అన్వర్, A చలం,
Sk మనీజ్ తదితరులు పాల్గొన్నారు