షాద్ నగర్ లో బిఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు స్వాగతం..

*షాద్ నగర్ లో బిఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు స్వాగతం*

*కవితకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటం బహుకరించిన జాగృతి నేతలు*

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు షాద్ నగర్ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వెళ్తున్న సమయంలో షాద్ నగర్ పట్టణంలోని దూసకల్ బైపాస్ లో ఒక హోటల్ వద్ద కొద్ది సమయం అగారు. ఈ సందర్భంగా కవిత కు జాగృతి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు. ఎమ్మెల్సీ, ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు వచ్చిన విషయం తెలిసిన జాగృతి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హోటల్ వద్దకు చేరుకున్నారు. కార్యకర్తలను అందరికీ ఆప్యాయంగా పలకరించి వాళ్ళతో ఫోటోలు దిగారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు స్వర్గస్తులైన కారణంగా వారి కుటుంబాన్ని పరామర్శించడానికి పాలమూరు జిల్లాకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ జాగృతి అధ్యక్షుడు ముస్తఫా, నాయకులు రమేష్ నాయక్, శివ , రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..